Sunday, June 28, 2015

నువ్వేవ్వరో నేనెవరో తెలియని వేళ
చిరునవ్వు తో చిగురించేను మన స్నేహం
నేనున్నాను అని చెప్పకనే నా స్నేహం అన్న భావనలు
ఆనాటి అనుభవాలు నా కలం తో చిందించెను ఈ చిన్ని వాక్యాలు

తరగతి ముచ్చట్లు
అందరి అగచాట్లు
ఆపసోపాల పరీక్షలు

డబ్బాల్లోని తిండి పోట్లాటలు
చీటీ మాటి చరవాని మాట్లాడుకోవడాలు

మన మధ్య  చిరు  తగాదాలు
మన మనసుకి చేసెను గాయాలు

అహం వల్ల  వచ్చిన కోపమో
బాధతో వచ్చిన మౌనమో

పెరిగెను మన మధ్య దూరం
కల్గించెను గుండెకి భారం

మన స్నేహం కాకూడదు ఓ నాటి కావ్యం
ఎప్పటికి ఈ బంధం కావాలి ఓ మధుర జ్ఞాపకం
..