Showing posts with label mother love. Show all posts
Showing posts with label mother love. Show all posts

Tuesday, June 24, 2014

Dear mother..

ఆకలి అని అడగలేనప్పుడు కూడా 
గోరు ముద్దలు తినిపించే...... ఆ తీపి క్షణం!

దెబ్బ తగిలి బాధ తో అరిస్తే, అయ్యో అని పరిగెత్తుకు వచ్చే..... ఓ ఆత్రుత క్షణం !

తప్పులు చేసినా,వెన్ను తట్టి,
మంచిని బోధించే......... ఓ గురువైన క్షణం!

నువ్వు చేసిన చిలిపి చేష్టలకి,
    ముద్దాడే ........ ఓ మధుర క్షణం!

నువ్వు చేసిన మంచి పనులకు కన్నీళ్లు తెచ్చుకుంటూ,
గర్విస్తూ ప్రోత్సహించే ...... ఓ ప్రోత్సహ క్షణం!

కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యం చెప్పే,
....... ఆ చైతన్య క్షణం!

నువ్వు దూర ప్రాంతానికి వెళ్తున్నప్పుడు,
....... మనల్ని వీడలేని క్షణం!

ఈ క్షణాలన్నింటిలో గుర్తు తెప్పించే ఓ మధురమైన భావం
నిర్వచించడానికి పదాలు సరిపోని ఓ గొప్పదైన మూర్తి అమ్మ! అమ్మ!
అమ్మ!