Showing posts with label జీవితం. Show all posts
Showing posts with label జీవితం. Show all posts

Sunday, October 1, 2017

జీవితం ఒక ప్రయోగం

ఆశ నీది ఆశయం నీది 
జీవం నీది జీవితం నీది 
స్వరూపం నీది నిర్ణయం నీది 
ఆశల అలలో పుట్టిన స్వార్థం  నీది
స్వార్థం మనిషి తత్త్వం 
నిస్వార్థం ఓ ముసుగు 

అవసరం తో జనించే బంధం
బంధాలతో ముడిపడిన అనుబంధాలు, 
అనుబంధాల పర్వం ఓ ఆశల సముద్రం 
కులం మతం ఏదెక్కడి వర్ణం ?
ఏది తప్పు, ఏది ఒప్పు ?
ఎవరి సృష్టింపు ఈ కల్పితాలు ?

ప్రశ్న నీది, ప్రయాస నీది,
భావం నీది, భవితవ్యం  నీది,
ఈ ప్రయాణం లో ఎందరెందరో అతిధులు 
అతిధుల ఉత్ప్రేరకాలు నిమ్మిత్తమాత్రులు 
ఎవరికీ ఎవరు ఎక్కడివరకు ?

ఆలోచనల మొదలు ఆచరణ 
ఆచరణకు ముగింపు అనుభవం 
ప్రతి క్షణం అంతులేని ఆలోచనలు 
ఆలోచనల అంతఃప్రకంపనలు 
పరువం ప్రయాణం అనుభూతుల సాగరం 
జీవితమే ఒక ప్రయోగం 

ఎవరి ప్రయోగానికి ఎవరు భాధ్యులు   ?? 

ఏది నీది, ఏది నాది 
నీకు నీ అంతరాత్మ తప్ప !!
ఏది తోడు, ఏది నీడ
నీకు నువ్వే తోడు అన్నది  తప్ప !!
ఏది నిజం, ఏది అబద్దం 
నువ్వు మనిషి అన్న నిజం తప్ప !! 
ఎవరికి ఏది శాశ్వతం ??

నీ ప్రాణమే నీ బలం
నీ ప్రయత్నమే నీ స్నేహం 
నీ ధైర్యమే నీ ఆయుధం 
శ్వాస ఉన్నంత వరకే నీ సమయం 
అలసినా సొలసినా  ఆగకూడదు 
ఈ  జీవన ప్రయాణం

ఈ జీవ ప్రపంచం లో నీలాంటిది నీవోక్కరివే
సరితూగరు నీకు ఎవరు 
నీకు ఏది మంచి ఏది చెడు 
నిర్ణయించేది ఎవరు ?
ఎవరి అనుభూతి వారిదే
నిన్ను నువ్వు తెల్సుకో
నీ ఉనికిని నువ్వు  నిలుపుకో  



-28th Sep 2017